రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చెయ్యండి: మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2020-03-30T18:23:36+05:30 IST

ఖమ్మం: జిల్లాలో వ్యవసాయంపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చెయ్యండి: మంత్రి పువ్వాడ

ఖమ్మం: జిల్లాలో వ్యవసాయంపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ హాజరయ్యారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు లేకుండా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


మామిడి, బొప్పాయి రైతులు నష్టపోకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే సండ్ర కోరారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయలు పట్టణాలు, నగరాల వాసులకు చేరువ చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అజయ్ తెలిపారు.

Updated Date - 2020-03-30T18:23:36+05:30 IST