వాకర్ ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2020-10-03T20:16:15+05:30 IST
లకారం లో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఖమ్మం: లకారంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వాకర్ ప్యారడైజ్ ఖమ్మం నగరానికి మరో మణిహరంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచుతుందని పేర్కొన్నారు. రూ.2కోట్ల వ్యయంతో పార్క్ అదునికరించి వాకింగ్, జాగింగ్, యోగ, ఓపెన్ జిమ్, గ్రీనరి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక సదుపాయాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా బల్క చెత్తను సేకరించెందుకు కార్యక్రమ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్స్ కి ప్రశంసా పత్రాలు, టోపిలను అందజేశారు. జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి , మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.