పేదలకు వైద్య సేవల విషయంలో సంకోచం అవసరం లేదు- పువ్వాడ
ABN , First Publish Date - 2020-06-18T20:07:33+05:30 IST
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పేదలకు అవసరమైన సేవలకు ఏ విధమైన ఆటంకం ఉండకూడదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.

ఖమ్మం: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పేదలకు అవసరమైన సేవలకు ఏ విధమైన ఆటంకం ఉండకూడదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ముఖ్యంగా పేదలకు వైద్య సేవలు అందించే విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావే శానికి ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి పువ్వాడ ఆసుపత్రికి సంబందించి అనేక సమస్యలను ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి, పేదలకు సరైన వైద్యం అందించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.
ఆసుపత్రి అభివృద్ధితో పాటు ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ నివారణ చర్యలు, రానున్న సీజనల్ వ్యాధులతో పాటు అన్నిరకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్,జడ్పీఛైర్మన్ లింగాల కమల్‌రాజ్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ డా. మాలతి తదితరులు పాల్గొన్నారు.