స్వచ్చ మున్సిపాలిటీలే లక్ష్యంగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం-పువ్వాడ

ABN , First Publish Date - 2020-08-01T19:45:08+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా స్వచ్చ తెలంగాణ మిషన్‌లో భాగంగా స్వచ్చమున్సిపాలిటీలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు

స్వచ్చ మున్సిపాలిటీలే లక్ష్యంగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం-పువ్వాడ

ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా స్వచ్చ తెలంగాణ మిషన్‌లో భాగంగా స్వచ్చమున్సిపాలిటీలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లో అవసరమైన అన్నిచోట్ల పబ్లిక్‌టాయిలెట్స్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఖమ్మం కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్మించిన కేఫే కమ్‌ టాయిలెట్స్‌ మంత్రి ప్రారంభించారు.  స్వచ్చ భారత్‌, స్వచ్చ తెలంగాణలో భాగంగా 10లక్షల రూపాయల వ్యయంతో ఎక్సోరా ఎఫ్‌ఎం సంస్థ ఆధ్వర్యంలో కేఫే కమ్‌ టాయిలెట్స్‌ను నిర్మించారు. ఈసందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఆగస్టు 15 తేదీలోగా ఈ టాయిలెట్స్‌ నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఇప్పటికే మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారని అన్నారు. ఖమ్మం మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో పబ్లిక్‌టాయిలెట్స్‌ నిర్మాణాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌,మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T19:45:08+05:30 IST