భవిష్యత్‌తరాలకు స్వచ్చమైన గాలి ఇచ్చేందుకే హరితహారం-పువ్వాడ

ABN , First Publish Date - 2020-07-20T00:20:19+05:30 IST

భవిష్యత్‌ తరాలకు స్వచ్చమైన గాలిని అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆరవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టిందని, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

భవిష్యత్‌తరాలకు స్వచ్చమైన గాలి ఇచ్చేందుకే హరితహారం-పువ్వాడ

ఖమ్మం: భవిష్యత్‌ తరాలకు స్వచ్చమైన గాలిని అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆరవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టిందని, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం కార్పొరేషన్‌పరిధిలోని 3, 11వ డివజన్‌లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంఓల తెలంగాణ రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణ చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలు అమలుచేయడం మనకు గర్వకారణమని అన్నారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకే సీఎం కేసీఆర్‌ హరితయజ్ఞం ప్రారంభించారని చెప్పారు. 


తెలంగాణ హరితహారం పేరిట ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నానికి ఐదేండ్ల కిందట సీఎం కేసీఆర్‌ బీజం వేశారని చెప్పారు. ముఖ్యమంత్రి దూరదృష్టికి, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌జయంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-20T00:20:19+05:30 IST