ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రాకుండా చూడాలి- పువ్వాడ

ABN , First Publish Date - 2020-05-09T01:31:18+05:30 IST

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రాకుండా చూడాలి- పువ్వాడ

ఖమ్మం: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గం తనికెళ్ల , సింగరాయపాలెం గ్రామాల్లోకొనసాగుతున్న కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన  కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, తరలించేందుకు ఉన్నలారీలు, రైతుల వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయం పై కూడా మంత్రి అజయ్‌కుమార్‌ అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సింగరాయపాలెం గ్రామంలో నర్సరీని మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, ఎమ్మెల్యే రాములు నాయక్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌, ఖమ్మం డిసిసి బ్యాంక్‌ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T01:31:18+05:30 IST