సెక్రటేరియట్‌కూల్చివేత పనులను చూసే అవకాశం కల్పిస్తాం- ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-27T20:40:37+05:30 IST

తెలంగాణ సెక్రటేరియట్‌ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాతభవనాల కూల్చివేత పనులు చేపట్టిన విషయం తెలిసింది.

సెక్రటేరియట్‌కూల్చివేత పనులను చూసే అవకాశం కల్పిస్తాం- ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాతభవనాల కూల్చివేత పనులు చేపట్టిన విషయం తెలిసింది. ఆయా కూల్చివేత పనులను మీడియా తిలకించేందుకు సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రభుత్వం నేరుగా వారిని అక్కడికి తీసుకెళ్తుందని రోడ్లుభవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. భవనాల కూల్చివేత, శిధిలాల తొలగింపు ఇప్పటికే 90శాతం పూర్తయినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. శిధిలాలు(వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగితా పనులు జరుగుతున్నాయి. ఎత్తయిన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగానే మీడియాను కూడా అనుమతించలేదు. 


కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విజ్ఞప్తిని పరిశీలించి కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించి వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈసందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలుజరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్నిచూపించాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు సోమవారం సాయంత్రం 4గంటలకు బిఆర్‌కె భవన్‌ నుంచి మీడియా ప్రతినిధులను సిటీపోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో తీసుకెళ్లి సెక్రటేరియట్‌ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు. 

Updated Date - 2020-07-27T20:40:37+05:30 IST