సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా దూరం
ABN , First Publish Date - 2020-03-27T20:07:23+05:30 IST
సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్‌ను నిరోధించ గలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు
వనపర్తి: సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్‌ను నిరోధించ గలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ లాక్‌డౌన్ భాగంగా ఎక్కడి వారుఅక్కడే ఉండాలన్నారు. ఇల్లువదిలి బయటకు రావద్దనిచెప్పారు. బతుకు తెరువుకోసం నెలల కొద్దీ సంవత్సరాలు కొద్దీ కుటుంబాలకు దూరంగా ఉండేవారు కరోనా వంటి ఆపద సమయంలో మూడువారాల పాటు ఇంట్లోనే ఉండలేమా?అన్నారు.లాక్‌డౌన్ సమయంలో వ్యాపారులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మకూడదని, అలాంటి వాపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే కూరగాయల ధరలు పెంచి అమ్మినా చర్యలు తప్పవన్నారు. అత్యవసర సమయంలో ఽఎక్కువ ధరలకు అమ్మి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావద్దన్నారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కొనుగోలు సమయంలోనూ ప్రజలు సామాజిక దూరాన్నిపాటించాలని మంత్రి సూచించారు. ఈ సీజన్‌లో వనపర్తి మార్కెట్ ధాన్యం, మొక్కజొన్నలను తీసుకు రావద్దని రైతులకు విజ్ఞప్తిచేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయా గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు ఎక్కువ కేంద్రాలను ఐకేపీ సంఘాలకు అప్పగించాలన్నారు. ఏ గ్రామంలో పండిన పంట ఆగ్రామంలోనే కొనుగోలుచేయాలన్నారు. కరోనా కారణంగా మామిడి, బత్తాయి విదేశాలకు పంపే అవకాశం లేనందున పెద్ద పెద్దమాల్స్, సూపర్ మార్కెట్‌లతో టై అప్ చేసుకోవాలన్నారు.