నాబార్డ్ ఛైర్మన్‌తో మంత్రి నిరంజన్‌రెడ్డి భేటీ
ABN , First Publish Date - 2020-11-03T23:04:52+05:30 IST
మహారాష్ట్రలో నాలుగు రోజుల పాటు అధికారిక పర్యటన చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం నాబార్డ్ ఛైర్మన్ డా.గోవిందరాజులు చింతలతో
హైదరాబాద్: మహారాష్ట్రలో నాలుగు రోజుల పాటు అధికారిక పర్యటన చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం నాబార్డ్ ఛైర్మన్ డా.గోవిందరాజులు చింతలతో (జిఆర్ చింతల)తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రత్యేకించి రాష్ట్రంలో వ్యవసాయం తీరును వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను కూడా ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి నాబార్డ్ ఛైర్మన్‌కు వివరించారు.