పత్తి కొనుగోలులో తేమశాతం పెంచండి- మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-11-03T21:14:39+05:30 IST

ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పత్తిపంట తీవ్రంగా దెబ్బతిన్నదని, పంట తడిసిపోవడం వల్ల తేమ ఎక్కువగా ఉందని, కాబట్టి పత్తికొనుగోలు లో కాటన్‌కార్పారేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తేమశాతాన్ని పెంచి కొనుగోలు చేయాలని వ్యవసాయ

పత్తి కొనుగోలులో తేమశాతం పెంచండి- మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పత్తిపంట తీవ్రంగా దెబ్బతిన్నదని, పంట తడిసిపోవడం వల్ల తేమ ఎక్కువగా ఉందని, కాబట్టి పత్తికొనుగోలు లో కాటన్‌కార్పారేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తేమశాతాన్ని పెంచి కొనుగోలు చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర లో అధికారిక పర్యటనలో ఉన్న ఉన్న నిరంజన్‌రెడ్డి మంగళవారం ముంబయ్‌లోని సీసీఐ కార్యాలయంలో సంస్థ ఛైర్మన్‌ ప్రదీప్‌కుమార్‌ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా తెలంగాణ రైతుల తరపున పలు డిమాండ్లను ఆయన చేశారు. ఈసందర్భంగా ప్రస్తుతం పత్తి కొనుగోలులో 12శాతం ఉన్న తేమ నిబంధనను సవరించాలని కోరారు.


అలాగే 2019-20 సంవత్సరానికి 49.56 లక్షల పత్తిబేళ్లను సీసీఐ నిల్వచేయగా అందులో 9.28లక్షల బేళ్లను మాత్రమే తరలించిందన్నారు. పాత నిల్వలను వెంటనే తరలించి కొత్తగా కొనుగోలు చేసిన పత్తినిల్వకు సహకరించాలని కోరారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధిపొందిందని, పత్తి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం అభివృద్దిచేసిన సాఫ్ట్‌వేర్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని, దీనికి సీసీఐ సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-11-03T21:14:39+05:30 IST