రైతులకు ఆన్‌లైన్‌ సలహాలకు యాప్‌

ABN , First Publish Date - 2020-07-19T08:14:05+05:30 IST

వ్యవసాయంలో అన్నదాతలకు ఏ అనుమానం వచ్చినా ఆన్‌లైన్‌లో సందేహాల నివృత్తికి, సలహాల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్...

రైతులకు ఆన్‌లైన్‌ సలహాలకు యాప్‌

ఎరువుల కొరత రానీయొద్దు: నిరంజన్‌


హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో అన్నదాతలకు ఏ అనుమానం వచ్చినా ఆన్‌లైన్‌లో సందేహాల నివృత్తికి, సలహాల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) టి.కన్సల్ట్‌ యాప్‌ను రూపొందించింది. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి.. ప్రతినిధులతో భేటీ అయి యాప్‌ను ఆవిష్కరించి పనితీరును తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయ కమిషనరేట్‌ను తనిఖీ చేసిన మంత్రి.. ఎరువులు, రైతువేదికల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రానీయొద్దని అధికారులకు సూచించారు.

Updated Date - 2020-07-19T08:14:05+05:30 IST