కేంద్ర నుంచి 4.64 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా రావాలి- నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-03T21:06:05+05:30 IST

తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 36శాతం అధికంగా పంటు సాగు చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర నుంచి 4.64 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా రావాలి- నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 36శాతం అధికంగా పంటు సాగు చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం కేటాయింపుల ప్రకారం ఏప్రిల్‌ నెలలో తెలంగాణకు రావాల్సింది 1.06 లక్షల మెట్రిక్‌టన్నులయూరియా. కానీ సరఫరా చేసింది 1.29 లక్షల టన్నులని బకాయి 0.09 లక్షల మన్నులుగా ఆయన పేర్కొన్నారు. ఈసంవత్సరం ఆగస్టు నెల నాటికి 8.69 లక్షల మెట్రిక్‌న్ను  యూరియా ఇవ్వాల్సి ఉండగా 6.15 లక్షల మెట్రిక్‌టన్నులు మాత్రమే కేంద్రం సరఫరా చేసింది. 2.54 బకాయి రావాల్సి వుంది. గత వానాకాలానికి ఈ ఏడాది వానాకాలానికి పెరిగిన సాగును కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డిపేర్కొన్నారు. కేంద్రం ఇంకా 4.64 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఇవ్వాల్సి వుందన్నారు. 2020-21 వానాకాలానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కేటాయించింది 10.50 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా, 11.80 లక్షల మెట్రిక్‌టన్నుల ఇతర ఎరువులతో కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్‌టన్నులు రావాల్సి ఉందన్నారు. 


రాష్ర్టానికి అవసరమైన ఎరువులను అంచనా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంతో స్వయంగా మాట్లాడారని అన్నారు. తాను సైతం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో కలిసి రెండు సార్లు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. పలుమార్లు ఈవిషయంలో లేఖలు రాసినట్టుచెప్పారు. ఇతర ఎరువుల విషయంలో ఎలాంటి సమస్యలేదన్నారు. యూరియా సరఫరాలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. సెప్టెంబరు 30, 2020 వానాకాలం సీజన్‌ ముగిసే నాటికి రావాల్సిన బకాయిలు2.54 లక్షల మెట్రిక్‌టన్నులతో పాటు సెప్టెంబరునెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్‌టన్నులతో కలిపి కేంద్రం నుంచి ఇంకా రావాల్సింది 4.64 లక్షలమెట్రిక్‌టన్నుల యూరియా రావాల్సి వుందన్నారు. 

Updated Date - 2020-09-03T21:06:05+05:30 IST