టీ-కన్సల్ట్‌యాప్‌ తీసుకు రావడం ప్రశంసనీయం- నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-19T20:23:06+05:30 IST

తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి రైతులకుపూర్తి సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా) రూపొందించిన టీ-కన్సల్ట్‌ యాప్‌ను తీసుకురావడం ప్రశంసనీయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

టీ-కన్సల్ట్‌యాప్‌ తీసుకు రావడం ప్రశంసనీయం- నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి రైతులకుపూర్తి సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా) రూపొందించిన టీ-కన్సల్ట్‌ యాప్‌ను తీసుకురావడం ప్రశంసనీయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ కొత్త యాప్‌ వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయంలోని అన్ని సమస్యల పై సమగ్ర అవగాహన, తాజా పరిస్థితుల వివరాలు, సమస్యలకు పరిష్కారం పొందేందుకు శాస్త్రవేత్త రైతులకు అనుసంధానం చేసేలా టీ-కన్సల్ట్‌ కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు అందించేందుకు , ముఖ్యంగా కరోనా సమయంలో ఎదుర్కొంటున్నఆర్ధిక, రవాణ, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టేషన్‌ను టీ.కన్సల్ట్‌యాప్‌ను టీటా ఇప్పటికే ప్రవేశ పెట్టిందన్నారు.


తాజాగా వ్యవసాయంలోని అన్నిసమస్యలపై సమగ్ర అవగాహన, తాజా పరిస్థితుల వివరాలను, సమస్యలు, పరిష్కారాలు పొందేదుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. టీ-కన్సల్ట్‌యాప్‌ ద్వారా రైతులు అపాయింట్‌మెంట్‌ బుక్‌చేసుకుని అగ్రికల్చర్‌ సైంటిస్టులతో సహాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో రైతులకుమరింతగా సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డిస్పష్టంచేశారు. 

Updated Date - 2020-07-19T20:23:06+05:30 IST