వలస కార్మికులకు రూ.334 కోట్లు: మల్లారెడ్డి

ABN , First Publish Date - 2020-04-25T08:38:37+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి వలస కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు సాయం అందనుంది.

వలస కార్మికులకు రూ.334 కోట్లు: మల్లారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి వలస కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు సాయం అందనుంది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ నిధిని వినియోగించుకోవాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో వలస కార్మికుల సంక్షేమం కోసం రూ.334 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి ధ్రువీకరించారు. కాగా, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున సాయం అందించాలని కార్మికుల సేవాసంఘం చైర్మన్‌ కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి బి.అనంతయ్య కోరారు. 

Updated Date - 2020-04-25T08:38:37+05:30 IST