మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి: దాసోజు
ABN , First Publish Date - 2020-12-10T08:35:54+05:30 IST
భూకబ్జా కేసులను ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రుల తీరు చూస్తుంటే కంచే.. చేను మేసినటనుగా

హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): భూకబ్జా కేసులను ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రుల తీరు చూస్తుంటే కంచే.. చేను మేసినటనుగా ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్ నాయకుల అవినీతికి అంతులేకుండా పొయిందని, రాష్ర్టాన్ని రాబందుల్లా దోచుకుతింటున్నారని ఆరోపిపంచారు. సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం నిబద్ధత ఉన్నా.. మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.