భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చర్యలు!
ABN , First Publish Date - 2020-09-16T09:00:19+05:30 IST
భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 9 సంక్షేమ పథకాల ద్వారా వారి బాగోగులు ..

మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 9 సంక్షేమ పథకాల ద్వారా వారి బాగోగులు చూస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 9,15,287 మంది కార్మికులు ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యారని, రూ.1,513 కోట్లు వారి కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు.