దుర్మార్గపు ఎజెండాలను ప్రజలు తిప్పికొట్టాలి: కేటీఆర్

ABN , First Publish Date - 2020-11-28T00:24:00+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్

దుర్మార్గపు ఎజెండాలను ప్రజలు తిప్పికొట్టాలి: కేటీఆర్

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రియల్‌ ఎస్టేట్ 2020 సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో సామరస్యాన్ని దెబ్బతీయొద్దని పార్టీలను కోరారు. ఇలాంటి దుర్మార్గపు ఎజెండాలను ప్రజలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో కొన్ని ఇబ్బందులు వాస్తవమేనని తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఈ సమస్యను అధిగమిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లలో పారదర్శకత ఉందని చెప్పారు. డబ్బు ఖర్చు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయికి చేరాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Read more