పరిశుభ్రతతో వ్యాధులు దూరం: కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-05-11T08:47:00+05:30 IST

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చిన...

పరిశుభ్రతతో వ్యాధులు దూరం: కేటీఆర్‌

  • ఉదయం 10 గంటలకు.. 10 నిమిషాలు 
  • పరిసరాలను శుభ్రం చేసిన మంత్రులు
  • నిల్వ నీటిని తొలగించి.. చెత్తను ఏరేశారు

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చిన మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌.. తానూ ఆచరించి చూపారు. ప్రగతి భవన్‌లో ఉన్న పూల కుండీలను శుభ్రం చేశారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. యాంటీ లార్వా మందును పిచికారీ చేశారు. 10 వారాల పాటు వారానికి ఒక రోజు 10 నిమిషాల పాటు ప్రతి ఒక ్కరూ తమ ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తే సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలోని పూల కుండీల్లో చెత్త, నీటిని ఆయన తొలగించారు. మంత్రుల నివాసంలోని తన ఇంటిలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌.. కూతురు, మనవరాలితో కలిసి పూల కుండీలు, తొట్టీలను శుభ్రం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంటి ఆవరణలోని చెట్ల కుండీలను శుభ్రం చేశారు. మంత్రి మల్లారెడ్డి తన ఇంటితో పాటు పరిసరాల్లోనూ పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఖమ్మంలోని తన ఇంటిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పూల కుండీలలో నిలువ ఉన్న నీటిని తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంటి ఆవరణలో ఉన్న పాత సామాన్లను కూడా తొలగించారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న బావిలో బ్లీచింగ్‌ పౌడర్‌ వేశారు.   


Updated Date - 2020-05-11T08:47:00+05:30 IST