పద్మారావు మాస్క్ పెట్టుకోలేదు.. అందుకే కరోనా వచ్చింది: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2020-07-08T22:53:26+05:30 IST

ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తాను మాస్క్ పెట్టుకోమని చెబితే పెట్టుకోలేదని..

పద్మారావు మాస్క్ పెట్టుకోలేదు.. అందుకే కరోనా వచ్చింది: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తాను మాస్క్ పెట్టుకోమని చెబితే పెట్టుకోలేదని.. ఆ మరుసటి రోజే ఆయనకు కరోనా వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.  కరోనా మరణాలకంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలే ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ వాఖ్యానించారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే రాజకీయ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమేనన్నారు. తాము కూడా కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చని.. కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడంలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులు కూడా ఎక్కడో ఒక చోట ఉంటాయని.. అవి పట్టుకుని బూచీగా చూపడం తప్పని మంత్రి కేటీఆర్ అన్నారు. 

Updated Date - 2020-07-08T22:53:26+05:30 IST