నూతన కార్పొరేటర్లతో కేటీఆర్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-12-06T22:00:01+05:30 IST

ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు.

నూతన కార్పొరేటర్లతో కేటీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఈ సమావేశంలో ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. గెలిచిన కార్పొరేటర్లలో కొందరు రెండోసారి ఎన్నికైన వారు, మరి కొందరు మొదటిసారిగా గెలిచిన వారు ఉన్నారు. ఈసందర్భంగా కేటీఆర్‌ నూతన కార్పొరేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. 


కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కేటీఆర్‌ దిశానిర్ధేశం చేస్తారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పై ఎలా స్పందించాలి? ప్రభుత్వం ప్రవేశ పెట్టే వివిధ సంక్షేమ పధకాలు స్థానికంగా ప్రజలకు చేరే విధంగా కార్పొరేటర్లు ఎలా పనిచేయాలన్న విషయాలను కూడా కేటీఆర్‌ వివరిస్తారు. అలాగే మేయర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై పై అందరు కార్పొరేటర్ల అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-12-06T22:00:01+05:30 IST