గిఫ్ట్ ఎ స్మైల్ కింద మ‌రో మూడు అంబులెన్స్‌లు

ABN , First Publish Date - 2020-10-03T21:01:37+05:30 IST

గిఫ్ట్ ఎ స్మైల్ కింద మ‌రో మూడు అంబులెన్స్లు వాహ‌నాలను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

గిఫ్ట్ ఎ స్మైల్ కింద మ‌రో మూడు అంబులెన్స్‌లు

హైదరాబాద్: గిఫ్ట్ ఎ స్మైల్ కింద మ‌రో మూడు అంబులెన్స్లు వాహ‌నాలను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేలంతా క‌లిసి ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అంబులెన్స్ వాహ‌నాన్ని ఉచితంగా ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చారు. మంత్రితో స‌హా అంతా ఆ వాహ‌నాల‌కు కావాల్సిన డ‌బ్బులు ఇచ్చి, ఆక్సీజ‌న్, వెంటిలేట‌ర్ స‌హా స‌క‌ల స‌దుపాయాల‌తో అంబులెన్స్ వాహ‌నాల‌ను సిద్ధం చేయించారు. అందులో ఇప్ప‌టికే కొన్ని వాహ‌నాలను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.


తాజాగా శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మ‌రో మూడు అంబులెన్స్ వాహ‌నాల‌ను మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, వరంగ‌ల్ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత‌, ఎమ్మెల్యేలు శంక‌ర్ నాయ‌క్, ఆరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, నేత ల‌క్ష్మ‌ణ్ రావుల స‌మ‌క్షంలో మంత్రి కెటిఆర్ ప్రారంబించారు. ఈ మూడు వాహ‌నాలు వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, వ‌రంగల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ త‌దిత‌రుల నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన‌వి.


ఈ సంద‌ర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్ర‌జ‌ల కోసం ఉప‌యోగ‌ప‌డే విధంగా అంబులెన్స్ వాహ‌నాల‌ను ఇవ్వ‌డానికి ముంద‌కు వ‌చ్చార‌న్నారు.ఆ విధంగా త‌మ ఔదార్యాన్ని చాటుకున్నార‌ని అభినందించారు. అయితే, క‌రోనా నేప‌థ్యంలో వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఆ వాహ‌నాల‌ను వారికే అప్ప‌గించినట్లు కెటిఆర్ తెలిపారు. ప్ర‌జ‌లకు ఆ వాహ‌నాల‌ను స‌ద్వినియోగం చేయాల‌ని కోరారు.


నేత‌ల‌ను మంత్రి కెటిఆర్ అభినందించారు. నిత్యం అందుబాటులో ఉంటూ, అడిగిన‌దే త‌డ‌వుగా, వాహ‌నాల‌ను ప్రారంభించిన కెటిఆర్ కి మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, వరంగ‌ల్ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత‌, ఎమ్మెల్యేలు శంక‌ర్ నాయ‌క్, ఆరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, నేత ల‌క్ష్మ‌ణ్ రావు త‌దిత‌రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Updated Date - 2020-10-03T21:01:37+05:30 IST