‘కార్పొరేటర్‌ ఆడియో’పై కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-09-18T11:53:02+05:30 IST

ఇళ్ల నిర్మాణదారుల నుంచి డబ్బుల వసూళ్లపై అడిక్‌మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ హేమలతారెడ్డి, ఆమె భర్త జయరాంరెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ, పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా

‘కార్పొరేటర్‌ ఆడియో’పై కేటీఆర్‌

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణదారుల నుంచి డబ్బుల వసూళ్లపై అడిక్‌మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ హేమలతారెడ్డి, ఆమె భర్త జయరాంరెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ, పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ మేయర్‌, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ఆదేశించినట్లు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులతోపాటు ఎమ్మెల్యే గోపాల్‌ వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. , కార్పొరేటర్‌ హేమలతారెడ్డిని బర్తరఫ్‌ చేయాలని మాజీ కార్పొరేటర్‌, బీజేపీ నాయకురాలు సునీతా ప్రకాశ్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-18T11:53:02+05:30 IST