గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి- కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-12-30T20:05:43+05:30 IST

జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి- కేటీఆర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చివాటి పరిష్కారానికి ప్రజా ప్రతినిధుల బాధ్యతగా భావించాలన్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రభుదాస్‌ను పార్టీసీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేటీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. 


ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ గెలిపించినందుకు ప్రజల కష్టాలు తీర్చి వారి మన్ననలను పొందేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లిని ఈసందర్భంగా కేటీఆర్‌అభినందించారు. డివిజన్‌ అభివృద్ధికి సహకరించాలని ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కార్పొరేటర్‌ కోరారు.. ఆయా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు పోగా వాటి పరిష్కారానికి సహకరిస్తామని అన్నారు. 

Updated Date - 2020-12-30T20:05:43+05:30 IST