సురవరం ప్రతాప రెడ్డికి మరింత గుర్తింపు రావాలి- కేటీఆర్
ABN , First Publish Date - 2020-12-28T21:34:50+05:30 IST
సురవరం ప్రతాపరెడ్డి అంటేనే గుర్తుకు వచ్చేది గోల్కొండ పత్రిక. అంతేకాకుండా ఆయనలోని మిగిలిన కోణాలు, పార్శ్వాలు ప్రజలకు ఇంకా తెలియాల్సి ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: సురవరం ప్రతాపరెడ్డి అంటేనే గుర్తుకు వచ్చేది గోల్కొండ పత్రిక. అంతేకాకుండా ఆయనలోని మిగిలిన కోణాలు, పార్శ్వాలు ప్రజలకు ఇంకా తెలియాల్సి ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగాయి. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సురవరం సంకలనాల ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చన్నారు. 125 సంవత్సరాల తర్వాత ఆయను గుర్తుచేసుకుంటే ఎంత కాలం జీవించామన్నది కాదు....ఎలా జీవించామన్నదే ముఖ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు.
125 ఏళ్ల తర్వాత కూడా ఆయన గురించి ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ప్రతాపరెడ్డి సమాజంపై తనదైన ముద్ర వేశారని అన్నారు. సంఘసంస్కర్తగా, సంపాదకుండిగా, పాత్రికేయుడిగా, కవిగా, రచయితగా, సాహితీ వేత్తగా ఆయన ఎన్నో సేవలు అందించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకపోతే ఎంతో మంది మహానుభావుల గురించి భవిష్యత్ తరాలకు తెలిసి ఉండేది కాదేమోనని అన్నారు. హెల్త్‌యూనివర్శిటీకి కాళోజీనారాయణరావుపేరు, వెటర్నరీ యూనివర్శిటీకి పీవీ నర్సింహారావుపేరు, హార్టికల్చర్‌యూనివర్శిటీకి కొండా లక్ష్మణ్‌బాపూజీపేరు, అగ్రికల్చర్ యూనివర్శిటీకి ప్రొఫెసర్ జయశకర్ సార్ పేరు పెట్టుకున్నారు.
ప్రతాపరెడ్డి పేరును కూఆ ఏదో ఒక యూనివర్శిటీకి పెడతామని ఈసందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, అదే విధంగా సురవరం ప్రతాపరెడ్డికి సైతం సముచితమైన గౌరవం ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్‌జర్నలిస్ట్స్ సంఘం(టీయూడబ్ల్యూజె) ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.