కుల మతాలకతీతంగా సంక్షేమ పధకాలు-కేటీఆర్
ABN , First Publish Date - 2020-11-27T21:32:07+05:30 IST
తెలంగాణలో కుల మతాలకతీతంగా సంక్షేమ పధకాలు అమలు జరుగుతున్నాయని మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో కుల మతాలకతీతంగా సంక్షేమ పధకాలు అమలు జరుగుతున్నాయని మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ర్టాన్ని ఎవరు ప్రగతి పధంలో నడిపిస్తున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశం ఎంతో ఆసక్తిగా గమనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే తెలంగాణలో అనేక పదకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లులాగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి సముచిత గౌరవం ఇస్తుందన్నారు. అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యులను కూడా పార్టీ ఆదరిస్తోందన్నారు. అందులో భాగంగానే ఇటీవల కొందరు నాయకులకు పదవులు ఇచ్చామన్నారు. వైశ్యకార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆయన నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానన్నారు.