తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, టీ.హబ్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2020-09-01T18:33:49+05:30 IST

తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, టీ.హబ్‌పై మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, టీ.హబ్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, టీ.హబ్‌పై మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో మన ముద్ర వేయగలిగామని తెలిపారు. టీ.హబ్‌ ద్వారా యువకులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నామని చెప్పారు. స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌, టీ.హబ్‌, టీ.వర్క్స్‌, వీ.హబ్‌ సంస్థల ద్వారా ఆయా రంగాల్లో వచ్చే ఆవిష్కరణలకు సహకారం అందించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని... వ్యవసాయం రంగంలో ఇన్నోవేషన్‌ పెరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-01T18:33:49+05:30 IST