బండి సంజయ్‌కి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌

ABN , First Publish Date - 2020-12-15T21:53:44+05:30 IST

బండి సంజయ్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను జైళ్లో పెట్టేముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూడాలని హితువు పలికారు.

బండి సంజయ్‌కి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌

జగిత్యాల: బండి సంజయ్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను జైళ్లో పెట్టేముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూడాలని హితువు పలికారు. కేసీఆర్‌కు ఉన్నది 40 ఎకరాల ఫామ్‌హౌజేనని.. బీజేపీ నాయకులు డ్రామాలను కట్టిపెట్టాలని అన్నారు. 40 ఎకరాల ఫామ్‌హౌజ్ కోసం ఎవరైనా కాళేశ్వరం కడతారా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ కట్టే దమ్ము లేదు కానీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి నిరూపించు.. కోర్టుకు వెళ్లు అని బండి సంజయ్‌కు సవాల్ చేశారు. నీళ్లిచ్చే తెలివి లేదు కానీ ఇస్తే ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణలు చేయడం కాదు.. నిరూపించే సత్తా ఉండాలని బండి సంజయ్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నిలదీశారు. 

Updated Date - 2020-12-15T21:53:44+05:30 IST