కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం: కొప్పుల ఈశ్వర్

ABN , First Publish Date - 2020-03-24T16:09:24+05:30 IST

హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కో్రారు.

కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం: కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కో్రారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమన్నారు. కరోన  వైరస్‌కు మందు గాని.. టీకా గాని లేదన్నారు. నివారణ ఒక్కటే మార్గమని ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోన  కేసులు పెరుగుతున్నాయని.. ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జాగ్రత్తలు తీసుకోకపోతే దానిని అదుపు చేయడం కష్టమని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.Read more