సూర్యాపేటలో నేటి నుంచి ఫ్లెక్సీల బంద్

ABN , First Publish Date - 2020-03-02T16:26:05+05:30 IST

సూర్యాపేటలో నేటి నుంచి ఫ్లెక్సీల బంద్

సూర్యాపేటలో నేటి నుంచి ఫ్లెక్సీల బంద్

సూర్యాపేట: మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు నేటి నుంచి జిల్లాలో ఫ్లెక్సీల ఏర్పాటును నిలిపివేయనున్నారు. నాయకులకు స్వాగతం పలికే ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేయవద్దని మంత్రి సూచించారు. ఫ్లెక్సీల బంద్ పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సూర్యాపేటలో పటిష్టంగా ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఫ్లెక్సీలు తొలగించాలంటూ మున్సిపల్ చైర్మన్, వైస్‌ చైర్మన్, కమిషనర్లను మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2020-03-02T16:26:05+05:30 IST