డిమాండ్‌ ఉన్న పంటల సాగుకే రైతులను సన్నద్ధం చేయండి-జగదీశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-30T22:41:58+05:30 IST

డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాల్సిందిగా రైతాంగాన్నిసన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యవసాయాధికారులకు ఉద్బోధించారు .

డిమాండ్‌ ఉన్న పంటల సాగుకే రైతులను సన్నద్ధం చేయండి-జగదీశ్‌రెడ్డి

కోదాడ: డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాల్సిందిగా రైతాంగాన్నిసన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యవసాయాధికారులకు ఉద్బోధించారు .దీని కోసం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు, రైతుబంధు సభ్యులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు జరుప తలపెట్టిన నియంత్రిత సాగు విధానం పై కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడలో జరిగిన డి విజన్‌స్థాయి అవగాహనా సదస్సులలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకూ ప్రణాళిక లోపం వల్ల తాను పండించిన పంటకు సరైన ధర నిర్ణయించుకోలేక పోవడం రైతాంగం దురదృష్టమని అన్నారు.


రైతులు దళారుల చేతిలో మోసపోకూడదన్న తలంపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. అందులో భాగంగానే నీటి సౌలభ్యత ఉన్న చోట ఆయిపామ్‌ వంటి సాగును ప్రోత్సహించడం ద్వారా రైతాంగాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పత్తితో పాటు అంతర్‌ పంటగా కంది వేస్తే రైతుకు లాభదాయకంటా ఉంటుందన్నారు. ఎస్‌ఎస్‌పి ఆయుకట్టు ప్రాంతంలో సన్నాలు వెయ్యడం ద్వారా కలిగే ప్రయోజ నాలను అధికారులు రైతులకు వివరించాలని సూచించారు. రైతు బంధు పథకం ఎప్పుడూ అమలులోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు బెల్లం మల్లయ్య యాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-30T22:41:58+05:30 IST