పేదలకు సన్న బియ్యం అందిస్తాం..మంత్రి ఈటల రాజేందర్
ABN , First Publish Date - 2020-10-31T07:25:50+05:30 IST
పేదలకు సన్న బియ్యం అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, కమలాపూర్ గ్రామాలలో శుక్రవారం వ రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మం త్రి ప్రారంభించారు

కమలాపూర్, అక్టోబరు 30 : పేదలకు సన్న బియ్యం అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, కమలాపూర్ గ్రామాలలో శుక్రవారం వ రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు అభ్యంతరాలు చెప్పొద్దని, రంగుమారిందనే నెపంతో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తిరస్కరించవద్దన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రభుత్వమే ధాన్యం మిల్లింగ్ చేసి పేదలకు అందిస్తుందన్నారు. ఇదివరకు సన్నరకాలను గ్రేడ్-బిలో కొనుగోలు చేసేవారని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి గ్రేడ్-ఎలో చేర్చి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రానికి అందిస్తే, ఒక్క తెలంగాణ రాష్ట్రమే 64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రానికి అందించిందన్నారు. దేశానికి అన్నం పెట్టే సత్తా తెలంగాణకు ఉందన్నారు. ప్రజాప్రతిఽనిధులు, అధికారులు, నాయకులు కలిసి ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
సన్న బియ్యానికే ఎక్కువ ధర
దొడ్డు రకం ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో సన్న బియ్యానికే ఎక్కువ ధర ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ప్రజలకు పీడీఎస్ బియ్యం కింద సన్న బియ్యం పంపిణీ చేస్తే బాగుంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో జంకుతుంటే.. మంత్రి ఈటల నిర్విరామంగా కొవిడ్-19 నియంత్రణకు కృషి చేస్తున్నాడని కొనియాడారు. ఈటలకు కరోనా రాలేదని, వైరస్ ఈటలకు భయపడుతోందా? అని చమత్కరించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. అర్బన్ జిల్లాలో 101 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో ఈసారి 96,400 ఎకరాలలో వరిసాగు చేయగా, దానిలో 83వేల ఎకరాలలో సన్నరకం సాగు చేశారన్నారు. వరి ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, డీఎ్‌సఓ వసంతలక్ష్మీ, ఎంపీపీ రాణి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ విజయ, జడ్పీటీసీ కళ్యాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ శ్రీనివాస్, తహసీల్దార్ విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఈటల భద్రయ్య, రమేష్, శ్రీకాంత్, లక్ష్మన్‌రావు, సాంబరావు, సంపత్, శేఖర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.