కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల గ‌డువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-10-07T20:24:45+05:30 IST

కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల రిన్యూవ‌ల్ గ‌డువు తేదిని పొడిగించిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవ‌దాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక  పాసుల గ‌డువు  పొడిగింపు

హైద‌రాబాద్: కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక  పాసుల రిన్యూవ‌ల్  గ‌డువు తేదిని  పొడిగించిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవ‌దాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. గత జూన్ నెల‌తో పాసుల గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ.. క‌రోనా నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు వార్షిక పాసుల గడువు పెంచినట్లు మంత్రి వెల్ల‌డించారు. కోవిడ్ ప్ర‌త్యేక ప‌రిస్థితు వ‌ల్ల ఏప్రిల్, మే, జూన్ నెల‌ల్లో కేబీఆర్ పార్కును మూసివేసిన నేప‌థ్యంలో  ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. జ‌న‌వ‌రి -2021 లో కొత్త పాసుల‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా కేబీఆర్  పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Read more