‘ఆ బిల్లు రైతుల పాలిట శాపంగా మారబోతోంది’

ABN , First Publish Date - 2020-05-09T00:01:36+05:30 IST

కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లు తెలంగాణ రైతన్నల పాలిట శాపంగా మారబోతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. సవరణ చట్టం పేరుతో

‘ఆ బిల్లు రైతుల పాలిట శాపంగా మారబోతోంది’

నిర్మల్: కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లు తెలంగాణ రైతన్నల పాలిట శాపంగా మారబోతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. సవరణ చట్టం పేరుతో ఉచిత కరెంట్‌కు కోత పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు, బిల్లులు మళ్లీ పుట్టుకొస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఫలితంగా రైతులు ఆర్థికంగా చితికిపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-09T00:01:36+05:30 IST