మంత్రి హరీష్‌రావు ఓ రైతుతో ఇలా..

ABN , First Publish Date - 2020-04-05T15:22:01+05:30 IST

తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఓ గ్రామంలో కారులో పర్యటించారు.

మంత్రి హరీష్‌రావు ఓ రైతుతో ఇలా..

తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఓ గ్రామంలో కారులో పర్యటించారు. తనకు ఎదురుపడిన ఓ రైతుతో కారులో ఉండి ముచ్చటించారు. ఫించన్ వచ్చిందా అని అడిగారు. వచ్చిందని ఆ రైతు చెప్పాడు. ఎంత వచ్చిందని మంత్రి అడుగగా రూ. 2వేలు వచ్చిందని చెప్పాడు.  బియ్యం వచ్చాయా అని అడిగారు. ఇంట్లో నలుగరం ఉంటామని, 48 కేజీలు బియ్యం వచ్చాయని చెప్పాడు.

 

ఊరిలో ఏమనుకుంటున్నారని మంత్రి అడుగగా.. ఏదో ఎయిడ్స్ వచ్చిందని అంటున్నారని, ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లవద్దని అంటున్నారని రైతు చెప్పాడు. మరి బయటకు వెళుతున్నారా? అని ప్రశ్నించగా వెళ్లడం లేదని చెప్పాడు. ఎప్పుడన్నా ఇలాంటిది చూశావా? అని మంత్రి అడుగగా.. తాను పుట్టినప్పటి నుంచి ఇలాంటిది చూడలేదని రైతు సమాధానమిచ్చాడు. తనకు ఇద్దరు కొడుకులని.. తినడం పడుకోవడం అంతేనని బయటకు వెళ్లడంలేదని చెప్పాడు. వ్యవసాయం చేస్తున్నావా? అని మంత్రి అడిగారు. ప్రస్తుతం వ్యవసాయం ఏమీ చేయడంలేదని, వర్షాకాలంలోనే చేస్తామన్నాడు. కెనాల్ పని అవుతుందా? అని మంత్రి అడిగారు. పనులు అవుతున్నాయన్నాడు. నీళ్లు వస్తున్నాయా? అని ప్రశ్నించగా మీ దయ ఉంటే వస్తాయని రైతు చెప్పగా మంచిదని హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2020-04-05T15:22:01+05:30 IST