తెలంగాణలో అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది : హరీశ్‌

ABN , First Publish Date - 2020-10-12T23:04:24+05:30 IST

తెలంగాణలో అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అడ్డుపడుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

తెలంగాణలో అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది : హరీశ్‌

హైదరాబాద్ : తెలంగాణలో అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అడ్డుపడుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజూర్‌నగర్‌ సీటును గెలిపించలేని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి దుబ్బాక సీటు గెలిపిస్తారా? అంటూ హరీశ్‌రావు సెటైరేశారు. హుజూర్‌నగర్‌లో చెల్లని ఉత్తమ్ మాట దుబ్బాకలో చెల్లుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. ‘దుబ్బాకలో కాంగ్రెస్‌, బీజేపీకి డిపాజిట్లు రావు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మైకుల ముందే టైగర్లు. మేం ఏం చేశామో వంద చెబుతాం.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒక్కటైనా చెప్పగలరా?. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు తొండి మాటలు మాట్లాడుతున్నారు’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. Updated Date - 2020-10-12T23:04:24+05:30 IST