పోలీసుల సోదాలపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-27T16:17:34+05:30 IST

బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం తగ్గిపోయిప వారంతా బయటకు పోతున్న క్రమంలో

పోలీసుల సోదాలపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

దుబ్బాక: బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం తగ్గిపోయి వారంతా బయటకు పోతున్న క్రమంలో బీజేపీ నేతలు సహనం కోల్పోయి మాట్లడుతున్నారని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రఘునందన్‌ రావు బంధువుల ఇళ్లల్లో పోలీసులు చేసిన సోదాలపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మారలేదని, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.


రాష్ట్ర అభివృద్ధిలో, నిధుల్లో తమ వాటా ఉందని బీజేపీ నేతలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తాము గట్టిగా తిప్పికొడితే.. ఇవాళ పోలీస్ అధికారులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.  డబ్బులు దొరికినట్లు పోలీసులు ఆధారాలు చూపిస్తే.. పోలీసులే డబ్బులు పెట్టారని ఉల్టా ప్రచారం చేస్తూ.. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బు వచ్చిందని పోలీస్ అధికారులు చెబుతున్నారని, దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-27T16:17:34+05:30 IST