దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-10-07T21:33:15+05:30 IST

దుబ్బాక ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చీకోడ్, మిరుదొడ్డి, గొడుగుపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మంత్రి

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: హరీశ్‌రావు

మెదక్: దుబ్బాక ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చీకోడ్, మిరుదొడ్డి, గొడుగుపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. దుబ్బాక ప్రజలు 99% టీఆర్ఎస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఖద్దరు అంగీలు వేసుకొని దుబ్బాకకు బయలుదేరారు. గతంలో ఎప్పుడు రానివారు ఇప్పుడు వస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉంటే ఒక ఇంటికి త్రాగు నీరు ఇవ్వలేదు. ఒక ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదు. రైతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే కనీసం అండగా లేని కాంగ్రెస్‌కు ఎలా ఓటేయమంటారు. ఏ మోహం పెట్టుకొని కాంగ్రెస్‌ ఓట్లు అడుగుతుందని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T21:33:15+05:30 IST