హరీష్ రావును అభినందించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2020-03-08T19:01:14+05:30 IST

డ్జెట్ రూపకల్పన అంశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర

హరీష్ రావును అభినందించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: బడ్జెట్ రూపకల్పన అంశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని కితాబిచ్చారు. ఆర్థిక మాంద్యంతో రాబడులు తగ్గి, కేంద్రం నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా బడ్జెట్ రూపొందించారని అన్నారు. సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం లభించిందన్నారు. ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని ఆర్థిక మంత్రిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

Updated Date - 2020-03-08T19:01:14+05:30 IST