అధికారుల తీరుపై హరీష్ రావు ఫైర్

ABN , First Publish Date - 2020-05-18T20:56:09+05:30 IST

పరిశ్రమల విషయాల్లో అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు బస్సులలో కనీస దూరం లేకుండా కార్మికులను

అధికారుల తీరుపై హరీష్ రావు ఫైర్

సంగారెడ్డి: పరిశ్రమల విషయాల్లో అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు బస్సులలో కనీస దూరం లేకుండా కార్మికులను తరలిస్తున్నారని అన్నారు. పరిశ్రమల్లో కాలుష్యం, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రి హరీష్ రావు సోమవారం సమావేశం అయ్యారు. కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైజాగ్ ప్రమాద ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామని మంత్రి చెప్పుకొచ్చారు. ఫైర్ సేఫ్టీ వాళ్లు సరిగా ఇండస్ట్రీలను చెక్ చేయడం లేదనుకుంటానని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ల పని చేయడం లేదని, కంపెనీలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గత సంవత్సరం ఇండ్రస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చనిపోయారని అన్నారు. గ్యాస్, బాయిలర్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విష వాయువులు వదులుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T20:56:09+05:30 IST