అ‘భాగ్య’రాలికి పెళ్లి జరిపించిన హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-12-25T08:02:07+05:30 IST

మంత్రి హరీశ్‌రావు మరోమారు తన ఔదర్యాన్ని చాటుకున్నారు. అభాగ్యురాలు అయిన భాగ్యకు అన్నీ తానై అండగా నిలిచిచారు

అ‘భాగ్య’రాలికి పెళ్లి జరిపించిన హరీశ్‌రావు

అన్నీ తానై అండగా నిలిచి ఔదార్యం చాటిన మంత్రి


సిద్దిపేట సిటీ, డిసెంబరు 24: మంత్రి హరీశ్‌రావు మరోమారు తన ఔదర్యాన్ని చాటుకున్నారు. అభాగ్యురాలు అయిన భాగ్యకు అన్నీ తానై అండగా నిలిచిచారు. చదివించి పెంచి పెద్ద చేసి.. ఆమె పెళ్లి కూడా జరిపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య.. తల్లిదండ్రులను కోల్పోయిన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌.. కలెక్టర్‌తో మాట్లాడి ఆపన్నహస్తం అందించారు.


2018లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న బాల సదనంలో ఆమెకు వసతి కల్పించారు. బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగం ఇప్పించారు.  భాగ్య అభీష్టం మేరకు.. సౌదీ నుంచి తిరిగొచ్చి టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఇబ్రహీంనగర్‌కు చెందిన రాజుతో గురువారం వివాహం జరిపించారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సిద్దిపేట జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్‌ రెడ్డి, ఇతర అధికారులంతా కలిసి సిద్దిపేట టీటీడీ భవనంలో భాగ్య పెళ్లి వేడుకగా జరిగింది.

Updated Date - 2020-12-25T08:02:07+05:30 IST