నా తడాఖా ఏంటో కొడంగల్‌లో చూపించా: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-11-01T02:00:02+05:30 IST

అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు

నా తడాఖా ఏంటో కొడంగల్‌లో చూపించా: హరీశ్‌రావు

సిద్దిపేట : అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘పరాయి నాయకులు.. కిరాయి మనుషులే బీజేపీకి దిక్కు. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ. వాళ్లు సీసాలు, పైసలు, అబద్దాలను నమ్ముకున్నారు. ఎక్కడెక్కడి లీడర్లు వచ్చి దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలయ్యాక వారెవరైనా ఇక్కడ ఉంటారా?. రేవంత్‌రెడ్డిని కొడంగల్‌కు పోయి ఓడించా. ఇది నా గడ్డ.. వాళ్లు వచ్చి ఏం చేస్తారు’ అని హరీశ్‌రావు  వ్యాఖ్యానించారు.

Read more