బీజేపీ, కాంగ్రెస్‌వి బట్టెబాజ్ మాటలు
ABN , First Publish Date - 2020-10-19T08:46:57+05:30 IST
రైతుల కష్టాలు తీర్చాలని, వారి కళ్లల్లో ఆనందం చూడాలని భావించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే.. అడుగడుగునా కాళ్లడ్డం పెట్టిన

కాళేశ్వరానికి కాళ్లడ్డం పెట్టినోళ్లు ఓట్లడుగుతారా?: మంత్రి హరీశ్
దుబ్బాక, అక్టోబరు 18: రైతుల కష్టాలు తీర్చాలని, వారి కళ్లల్లో ఆనందం చూడాలని భావించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే.. అడుగడుగునా కాళ్లడ్డం పెట్టిన పార్టీలు ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతాయని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరగా.. వారికి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలవి బట్టెబాజ్ మాటలని ధ్వజమెత్తారు. వారి బాగోతం పల్లెపల్లెనా వీడియోలతోసహా బయట పెడతామన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే టీఆర్‌ఎస్ వైపే దుబ్బాక ప్రజల తీర్పు ఉంటుందని స్పష్టం చేశారు. సుజాతమ్మకు లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.