అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లపై వేటు: సత్యవతి

ABN , First Publish Date - 2020-09-17T07:48:58+05:30 IST

అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లపై వేటు: సత్యవతి

అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లపై వేటు: సత్యవతి

అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు, నాణ్యత లేని గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను తొలగిస్తామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్‌, గొంగిడి సునీత, క్రాంతి కిరణ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్ల బిల్లులను నిలిపేస్తామని స్పష్టం చేశారు. గర్భిణులు, బాలింతలు, 3-6 ఏళ్ల చిన్న పిల్లలకు పౌష్టికాహారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 ఇస్తుంటే, తన వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4కుతోడు అదనంగా రూ.9.75 ఇస్తుందని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద రాష్ట్రం రూ.139.97 కోట్లను కేటాయించినట్లు వివరించారు.

Updated Date - 2020-09-17T07:48:58+05:30 IST