కలెక్టర్లతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-03-25T17:40:58+05:30 IST
కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ, కాంటాక్ట్ కేసుల పరిస్థితిపై సమీక్ష జరిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ట

హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ, కాంటాక్ట్ కేసుల పరిస్థితిపై సమీక్ష జరిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని మంత్రి ఈటల తెలిపారు. లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి ఈటల కోరారు.