కష్టాలు తెలిసిన ‘ఈటల’: నర్సులు
ABN , First Publish Date - 2020-07-19T07:54:42+05:30 IST
తమకు జీతాలు పెంచినందుకు మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఏజేసీ నేతలకు ఔట్‌సోర్సింగ్ నర్సులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. గాంధీ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్....

అడ్డగుట్ట, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తమకు జీతాలు పెంచినందుకు మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఏజేసీ నేతలకు ఔట్‌సోర్సింగ్ నర్సులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. గాంధీ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది యూనియన్ నాయకురాలు సుజాత శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కష్టాలు తెలిసిన మంత్రి ఈటల రాజేందర్ అని కొనిడాయారు. ‘‘పదిహేనేళ్లుగా గాంధీలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న మేము జీతాల పెంపు కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. మాకు జీతాలు పెంచడంలో మంత్రి ఈటలను ఒప్పించిన ఏజేసీ పాత్ర అభినందనీయం’’ అని ఆమె అన్నారు.