కరోనా కట్టడికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు: మంత్రి ఈటల
ABN , First Publish Date - 2020-06-23T02:26:26+05:30 IST
కరోనా కట్టడికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు: మంత్రి ఈటల

హైదరాబాద్: కరోనా కట్టడికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని చేతులు దులుపుకుందని వ్యాఖ్యానించారు. కరోనా పేరుతో బీజేపీ నేతలు కంపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల తమకున్న కమిట్‌మెంట్ ఎవరికీ ఉండదని మంత్రి ఈటల పేర్కొన్నారు.