వలస దారుల వల్ల కరోనా ప్రమాదం- మంత్రి ఈటల
ABN , First Publish Date - 2020-05-14T01:47:00+05:30 IST
రాష్ట్రంలో మొదటి విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల, తర్వాత మర్కజ్‌తో వైరస్ వ్యాప్తి ఎక్కువ జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల, తర్వాత మర్కజ్‌తో వైరస్ వ్యాప్తి ఎక్కువ జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కానీ తాజాగా వలసదారుల (మై గ్రంంట్స్) వల్ల కరోనా వైరస్ ప్రమాదం ఉందని తెలిపారు. లాక్‌డౌన్ సడలింపు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలోకి పెద్దయెత్తున వలస కార్మికులు, ప్రయాణీకులు వస్తున్నారు. కాబట్టి మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని అన్నారు. విదేశాల నుంచి విమనాల ద్వారా వస్తున్న ప్రయాణీకులను హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంచుతున్నామని చెప్పారు. రైళ్ల ద్వారా వచ్చిన వారికి ప్రతి రైల్వేస్టేషన్‌లో వైద్య సిబ్బంది జ్వర పరీక్షలు చేసిహోమ్‌క్వారంటైన్ ముద్రను చేతికి మీద వేసి పంపిస్తున్నారకని తెలిపారు.
రోడ్డు మార్గంలో వచ్చిన వారికి రాష్ట్ర సరిహద్దులోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నారరని అన్నారు. ప్రతి గ్రామంలోకి బయటి నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేసి 14 రోజుల పాటు బయటకు వెళ్లకుండా ఆశా వర్కర్లు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ విమానాల్లో 798 మంది, రైళ్లలో 239 మంది, రోడ్డు మార్గం ద్వారా 41,805 మవుమంది రాష్ర్టానికి వచ్చినట్టు తెలిపారు. లాక్‌డౌన్ పడలింపు నేపద్యంలో ఎక్కువ మంది బయటకు వస్తున్న నేపధ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలన్నారు. బుధవారం గాంఽధీ వైద్యులు కరోనా పాజిటివ్ ఉన్న మరో గర్భిణీకి డెలివరీ చేశారని మంత్రి తెలిపారు.