విదేశాల నుంచి వచ్చిన వారికి సోయి ఉండాలి- ఈటల
ABN , First Publish Date - 2020-03-24T02:16:17+05:30 IST
క్వారంటైన్‌లో ఉండాల్సిన వాళ్లు రోడ్డు మీదకు రావడం పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: క్వారంటైన్‌లో ఉండాల్సిన వాళ్లు రోడ్డు మీదకు రావడం పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుకొనే వారు, ఉద్యోగాలు చేసేవారు, సోయి లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు పెడచెవిన పెట్టి పక్కన వారికి అంటించడం కరెక్ట్ కాదన్నారు. చెప్పినా వినని వారిని ఉపేక్షించమని, కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రజల బాగు కోసం ఆర్ధికంగా రాష్ట్రం ఎంత నష్టపోయినా ఫర్వాలేదు. మనిషి ప్రాణం ముఖ్యం. అని సీఎం కేసీఆర్ తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ తీవ్రతను పట్టించుకోకుండా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ ఉదయం అందరూ బయటకు రావడం సరికాదని అన్నారు. బయటికి వచ్చి వైరస్‌ను ఆహ్వానిద్దామా. మనకు మనం కట్టుబాటుతో ఉండి వైరస్‌ను అరికడదమా? తేల్చుకోబాలని అన్నారు.
గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌లో రొటీన్ చెకప్‌కి రావద్దుఅని ప్రజల్ని కోరారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే హాస్పిటల్స్‌కు రావాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం అంతర్జాతీయ విమానాలు కేంద్రం నిలిపి వేసింది. ఇప్పుడు విదేశాల నుంచి కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదు. దేశంలో ఉన్న ఇతర రాష్ర్టాల నుంచి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణకివచ్చే అన్ని దారులు మూసి వేశామని చెప్పారు. తెలంగాణలో 6ల్యాబ్స్‌కు అనుమతి వచ్చింది. సీసీఎంబి కూడా అందుబాటులోకి రాజుకు 1600 మందికి టెసులు చేసే అవకాశం ఉందన్నారు. నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా చేస్తామని కూరగాయల దుకాణాలు, చికెన్, మటన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సరుకుల రవాణా, పశువుల దాణా, కోళ్లదాణా రవాణా,తయారీ కేంద్రాలు నడుస్తాయన్నారు. వాటిని పోలీసులు ఆపవద్దని ఇప్పటికే జీవో జారీచేసినట్టు మంత్రి తెలిపారు.