‘ఉపాధి’ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-04-15T09:41:33+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు ఉపాధిహామీ పనులు చేశారు.

‘ఉపాధి’ పనులు చేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌రూరల్‌, ఏప్రిల్‌ 14: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు  ఉపాధిహామీ పనులు చేశారు. మంగళవారం పర్యటనలో భాగంగా పర్వతగిరి మండల కేంద్రం నుంచి రాయపర్తికి వెళ్తుండగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు కనిపించారు. వెంటనే కాన్వాయ్‌ ఆపి కూలీలతో ము చ్చటించారు. వారితో కలిసిపోయి తానూ గడ్డ్డపార చేతబట్టి స్వయంగా మట్టిని తవ్వారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పనులు చేయాలని, తప్పనిసరిగా మాస్కు, రుమాలు వాడాలని సూచించారు. అలాగే, అంబేద్కర్‌ జయంతి వేడుకలను పర్వతగిరిలో నిర్వహించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాలతి సోమేశ్వర్‌రావు, ఎంపీటీసీ రాజు, తదితరులు పాల్గొన్నారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పర్వతగిరి, రాయపర్తి మండల జర్నలిస్టులకు ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-15T09:41:33+05:30 IST