వీలయినంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించండి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-05-11T21:43:46+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు ఉపాధి హామీ పధకం కింద వీలయినంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.

వీలయినంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించండి- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు ఉపాధి హామీ పధకం కింద వీలయినంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు, కూలీలకు ఉపాధి కల్పన, కరోనా, వేసవి నేపధ్యంలో కూలీల భద్రత, నర్సరీలు, మొక్కల పంపకం, ఇంకుడుగుంతలు, వైకుంఠదామాలు తదితర అంశాలపె ౖ సోమవారం రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌ నుంచి అన్నిజిల్లాల అడిషనల్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించడమే కాకుండా కూలీలకు జాబ్‌కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. సగటున ప్రతి గ్రామ పంచాయితీ నుంచి 182 మంది కేలీలకు ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే పల్లె ప్రగతి, నర్సరీల్లో మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు,వైకుంఠదామాల నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-11T21:43:46+05:30 IST